body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:17pt;}.pf0{}
ఢిల్లీ,,16 , అక్టోబర్ (హి.స.)రష్యా నుంచి చమురు (Russias oil) కొనుగోలు ఆపేస్తామని భారత్ తనకు హామీ ఇచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా భారత్ (India) స్పందించింది. భారత వినియోగదారుల ప్రయోజనాల మేరకే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘చమురు, గ్యాస్ దిగుమతి చేసుకొనే దేశాల్లో భారత్ ముఖ్యమైనది. ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో వినియోగదారుల ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుంది. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యంతోనే ఉన్నాయి. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరాలను నిర్ధరించడమే మా ప్రధాన లక్ష్యాలు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉండటంతో పాటు సరఫరా గొలుసులు విస్తరించడానికే మేం ప్రాధాన్యం ఇస్తాం’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా అమెరికా నుంచి చమురు కొనుగోళ్ల విషయంపై కూడా ఆయన మాట్లాడారు. భారత్ తన ఇంధన దిగుమతులను విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. గత దశాబ్దకాలంలో ఇందులో పురోగతి వచ్చిందన్నారు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని స్పష్టంచేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ