body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,16 , అక్టోబర్ (హి.స.)కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కీలక సమాచారాన్ని అందించారు. యెమెన్‌లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేయబడిందని.. ప్రతికూలంగా ఏమీ జరగలేదని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. ఈ విషయంలో కొత్త మధ్యవర్తి రంగంలోకి దిగారని పేర్కొన్నారు.
నర్సు నిమిషా ప్రియను రక్షించడానికి దౌత్య మార్గాలను ఉపయోగించేందుకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా నిమిషా ప్రియ ఉరిశిక్ష ఏమైందని ప్రశ్నించగా.. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సమాధానం ఇస్తూ.. నిమిషా ప్రియ ఉరిశిక్ష ప్రస్తుతం నిలిచిపోయిందని.. ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరగడం లేదని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ