body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బెంగళూరు/ఢిల్లీ,17, అక్టోబర్ (హి.స.)నగర ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. నగరం చుట్టూ 117 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మించేందుకు బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ట్రాఫిక్‌ను రింగ్ రోడ్డు మీదకు మళ్లించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు వేసిన చారిత్రాత్మక అడుగని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ‘ట్రాఫిక్ రద్దీతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రద్దీని తగ్గించాలని అనుకుంటున్నాము. ఈ ప్రాజెక్టుతో 1900 కుటుంబాలపై ప్రభావం పడుతుంది. కానీ వారికి ప్రభుత్వంపై ఉన్న అంచనాల కంటే ఎక్కువగానే పరిహారాన్ని అందిస్తున్నాము. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో ఇదీ ఒకటి’ అని మంత్రి తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ