అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ,17, అక్టోబర్ (హి.స.) cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బిహార్ ఎన్నికల (Bihar Elections) కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం తాజాగా మాజీ సీఈసీ టీఎన్ శేషన్ మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయించింది. పర్దానషీన్ (బుర్ఖా ధరించిన) మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం టీఎన్ శేషన్ సారథ్యంలో ఈసీ 1994లో రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయనుంది .
ఇందుకు సంబంధించి బిహార్ ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్దానషీన్ మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రత్యేక క్యాబిన్స్ ఏర్పాటు చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌తో పాటు, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. మహిళల గోపత్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రత్యేక క్యాబిన్‌లల్లో మహిళా సిబ్బందితో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. బుర్ఖా ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల పరిధిలో ఈ ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో తగిన సంఖ్యలో మహిళా సిబ్బంది, కనీసం ఒక మహిళా పోలింగ్ అధికారి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ