భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం వ్యతిరేకం కాదు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala
భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం వ్యతిరేకం కాదు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,17, అక్టోబర్ (హి.స.): భావ ప్రకటనా స్వేచ్ఛ, మాట్లాడే హక్కు అనేవి ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా, నిజాయితీని శంకించేలా ఉండకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోవడం ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌పై లాయర్‌ రాకేశ్‌ కిశోర్‌ బూటు విసిరేందుకు ప్రయత్నించిన ఘటనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.

డబ్బుల కోసం సోషల్‌ మీడియాలో దిగజారి పోస్టులు పెడుతున్నారని మండిపడింది. సీజేఐపై ఈ నెల 6న బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్‌ రాకేశ్‌ కిశోర్‌(71)పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ అడ్వొకేట్‌ వికాస్‌ సింగ్‌ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం గురువారం స్పందించింది.

భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. కానీ, అది ఇతరులను అగౌరవపర్చేలా ఉండకూడదని స్పష్టంచేసింది. రాకేశ్‌ కిశోర్‌ ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని, పైగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని, అవి సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయని వికాస్‌ సింగ్‌ చెప్పారు. సుప్రీంకోర్టు సమగ్రతను దెబ్బతీసేలా ప్రచారం సాగుతోందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande