కుటుంబానికో ఉద్యోగం ఎలా సాధ్యం? కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆగ్రహం
పట్నా/**ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)**: ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రశ్నించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఆర్జేడీ ఇస్తున్న హామీ ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. ఓట్ల కోసం విచ
కుటుంబానికో ఉద్యోగం ఎలా సాధ్యం? కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆగ్రహం


పట్నా/**ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)**: ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రశ్నించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఆర్జేడీ ఇస్తున్న హామీ ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. ఓట్ల కోసం విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే వారికి వేతనాలు చెల్లించడానికి నిధులు ఎక్కడి తీసుకొస్తారని ప్రశ్నించారు.

2.6 కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వేతనాలు ఇవ్వాలంటే రూ.12 లక్షల కోట్లు కావాలన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు అది నాలుగు రెట్లు అని చెప్పారు. శుక్రవారం బిహార్‌ రాజధాని పట్నాలో మేధావులు, వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో అమిత్‌ షా మాట్లాడారు. బిహార్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన ఓటర్‌ అధికార్‌ యాత్రపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అది చొరబాటుదారులను కాపాడే యాత్ర అని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande