కర్నూలు, 18 అక్టోబర్ (హి.స.)నేటి వేగవంతమైన జీవితంలో సమయం లేకపోవడం వల్ల చాలా మంది అల్పాహారంగా బ్రెడ్ ఆమ్లెట్ లేదా మ్యాగీ వంటి త్వరగా తయారుచేసే ఆహారాలను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. రోజంతా శక్తిని పొందడానికి బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. కాబట్టి అది పోషకమైనదిగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, ప్రతిరోజూ బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఆరోగ్యానికి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
బ్రెడ్ ఆమ్లెట్ కొంతవరకు పోషకాలతో కూడిన అల్పాహారం. దీనిలో ఉపయోగించే గుడ్లుల్లో ప్రోటీన్ ఉంటుంది. గుడ్లలోని అధిక-నాణ్యత ప్రోటీన్ కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రెడ్ ఆమ్లెట్లు తినడం ప్రధానంగా మీరు వాటిని ఎలా తయారు చేస్తారు, ఎంత తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వారానికి రెండుసార్లు మాత్రమే గుడ్లు తింటే సరిపోతుంది.
గుడ్లలోని అమైనో ఆమ్లాలు ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు, చర్మానికి చాలా ముఖ్యం. బ్రెడ్‌లోని కార్బోహైడ్రేట్లు, గుడ్లలోని ప్రోటీన్, కొవ్వు కలయిక శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వారానికి 7 కంటే ఎక్కువ గుడ్లు తినే ఆరోగ్యవంతులకు కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV