రైలులో సీటు కోసం లొల్లి.. కోపంతో రైలులో బాంబ్ ఉందంటూ ఫిర్యాదు..
కాన్పూర్‌, 18 అక్టోబర్ (హి.స.)ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సీటు కోసం జరిగిన గొడవ రైల్వేలో సంచలనం సృష్టించింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు సోదరులు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి..తమతో కోట్లాడిన వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే కోరికతో రైలులో బాంబు ప
రైలులో సీటు కోసం లొల్లి.. కోపంతో రైలులో బాంబ్ ఉందంటూ ఫిర్యాదు..


కాన్పూర్‌, 18 అక్టోబర్ (హి.స.)ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సీటు కోసం జరిగిన గొడవ రైల్వేలో సంచలనం సృష్టించింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు సోదరులు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి..తమతో కోట్లాడిన వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే కోరికతో రైలులో బాంబు పెట్టినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. బాంబు అన్న మాటతో రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. బాంబ్ హెచ్చరిక రైల్వే సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తం రైలును దాదాపు 45 నిమిషాల పాటు తనిఖీ చేశారు. ప్రతిదీ సాధారణంగా కనిపించింది. తర్వాత ఫోన్ చేసిన ఇద్దరు సోదరులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

కాన్పూర్‌లోని ఘటంపూర్‌కు చెందిన ఇద్దరు సోదరులు 15708 ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్ (అమృత్‌సర్-కతిహార్)లో ప్రయాణిస్తున్నారు. కంపార్ట్‌మెంట్‌లోని సీటు విషయంలో ఇద్దరు అన్నదమ్ములతో కొంతమంది వాగ్వాదానికి దిగారు. దీనితో దీపక్ చౌహాన్ అనే వ్యక్తికి కోపం వచ్చి రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి రైలులో బాంబు అమర్చినట్లు సమాచారం ఇచ్చాడు. కంపార్ట్‌మెంట్ కిటికీ దగ్గర నల్లటి దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు రైలులో టైమ్ బాంబును అమర్చారని.. అది ఎప్పుడైనా పేలిపోవచ్చని చౌహాన్ చెప్పారు.

ఆ తర్వాత అతను తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ విషయం గురించి తెలియగానే రైల్వే సిబ్బంది ఒక్కసారిగా కుదుపుకు గురైంది. GRP, RPF, ACP, LIU రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి వరకు రైలును మూడుసార్లు తనిఖీ చేశారు. ఏమీ కనిపించకపోవడంతో..రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైలు తన గమ్య స్థానికి బయలుదేరింది. తప్పుడు ఫిర్యాదు చేసిన డియోరియాతో పాటు సిద్ధార్థనగర్‌కు చెందిన ముగ్గురు ప్రయాణికులను కూడా విడుదల చేశారు.

ఇద్దరు నిందితులు అరెస్టు ఈ ఫిర్యాదు తర్వాత.. బాంబు బెదిరింపును వ్యాప్తి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande