మాకు దీపావళి నవంబర్‌ 14నే.. చిరాగ్‌ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)**బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా ఉంది. ఈ తరుణంలో లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) చీఫ్ చిరాగ్ పాసవాన్‌ (Chirag Paswan) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నవంబర్ 14న దీపావళి చేసుకుంటా
మాకు దీపావళి నవంబర్‌ 14నే.. చిరాగ్‌ కీలక వ్యాఖ్యలు


ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)**బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా ఉంది. ఈ తరుణంలో లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) చీఫ్ చిరాగ్ పాసవాన్‌ (Chirag Paswan) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నవంబర్ 14న దీపావళి చేసుకుంటామని మీడియాతో వ్యాఖ్యానించారు.

‘‘ఎన్డీయేలో సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఖరారు విషయంలో ఎన్ని ఊహాగానాలు వచ్చినా.. అన్నీ సజావుగా జరుగుతాయని నేను పదేపదే చెప్తున్నాను. మహాగఠ్‌బందన్ ఒక గందరగోళ కూటమి. చరిత్రాత్మక విజయం దిశగా ఎన్డీయే ముందుకువెళ్తోందని నేను ధీమాగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలో మేం ఎన్నికల్లో పోటీపడుతున్నాం. నాకు కూటమిలోని ఏ ఒక్క పార్టీతో ఒక్క శాతం వివాదం కూడా లేదు. నవంబర్ 14న మేం దీపావళి చేసుకుంటాం (Diwali Celebrations)’’ అని పాసవాన్ విజయంపై ధీమా వ్యక్తంచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande