ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)** ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు
అలీనగర్ ప్రజలకు సేవ చేసేందుకు.. అభివృద్ధి, సంక్షేమం కోసం సంకల్పంతో పూర్తి శక్తితో పని చేస్తూ ఉంటానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలీ నగర్ ప్రజలకు సేవ చేయడానికి ఎన్డీఏ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ విధానాలను ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లడానికి పూర్తి అంకితభావం, నిబద్ధతతో పని చేస్తూనే ఉంటాననని చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ