అలుపెరగని సహకారం ,వందశాతం దేశీయ రక్షణ ఉత్పత్తులే..
ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)** నాసిక్‌: దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం దేశ భద్రతకు ముప్పని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. హిందుస్థాన్
rajnath singh


ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)** నాసిక్‌: దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం దేశ భద్రతకు ముప్పని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఆధ్వర్యంలో తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌ మార్క్‌-1ఏ’ ఉత్పత్తి కోసం మూడో కేంద్రాన్ని, హెచ్‌టీటీ-40 (శిక్షణ విమానం) తయారీ కోసం రెండో అసెంబ్లీ విభాగాన్ని ఆయన శుక్రవారం నాసిక్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు మనదేశం రక్షణ అవసరాల కోసం 65-70 శాతం వరకు విదేశాలపై ఆధారపడేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం మనం 65 శాతం ఆయుధాలను దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. త్వరలోనే దీన్ని 100 శాతానికి పెంచుతాం’’ అని పేర్కొన్నారు. భారత ఆయుధ ఎగుమతులు రూ.25వేల కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. 2029 కల్లా దేశంలో రూ.3లక్షల కోట్ల విలువైన ఆయుధాలను దేశంలో ఉత్పత్తి చేయాలని, రూ.50వేల కోట్ల విలువైన సాధన సంపత్తిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande