ప్రమాదకర స్థాయిలో దిల్లీ వాయు కాలుష్యం
ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) రోజు రోజుకు తీవ్రమవుతోంది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ (AQI) దిగజారడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400ల మార్క్‌ను దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరిలోకి వస్తుంది.
ప్రమాదకర స్థాయిలో దిల్లీ వాయు కాలుష్యం


ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) రోజు రోజుకు తీవ్రమవుతోంది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ (AQI) దిగజారడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400ల మార్క్‌ను దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరిలోకి వస్తుంది. పండగ వేళ రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదు అయ్యింది. ఈ సీజన్‌లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ వెల్లడించింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఏక్యూఐతో తర్వాతి స్థానంలో ఉంది.

పెరుగుతున్న కాలుష్య స్థాయులను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా నమోదైనట్లు తెలిపారు. రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాలలో తొమ్మిది ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరిలోకి వచ్చినట్లు తెలిపారు. ఆనంద్ విహార్‌లో (389), వజీర్‌పూర్ (351), జహంగీర్‌పురి (310), ద్వారక (310) ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.

శీతాకాలం సమీపిస్తుండడం, నగరంలో వాహన ఉద్గారాలు పెరగడం వల్ల కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు కాలుష్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande