వాషింగ్టన్: /ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.)
గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ