యూపీ, 19 అక్టోబర్ (హి.స.)
ఉత్తరప్రదేశ్ ఇంట్లో రూ. 30 లక్షల చోరీ కేసును చేదించారు పోలీసులు. భార్యనే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సోదరుడిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ చోరీ చేసినట్లు తెలిపారు. తమ్ముడి కిడ్నీ ట్రీట్మెంట్కు రూ. 30లక్షలు అవసరముండగా.. తన ఇంట్లోని రూ. 50వేలు, విలువైన ఆభరణాలను దొంగిలించింది. అయితే ఇదంతా తెలియని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు.. భార్యతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వ్యాపారి భార్య పూజా మిట్టల్ (32), తన తల్లి అనితా (53), చెల్లెలి భర్త రవి బన్సల్ (36), రవి సోదరి భర్త దీపక్ (24) చోరీలో నిందితులుగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..