ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.)ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని నగరాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆ లైట్లు నెలల తరబడి ఉంటాయి. దీపాలు, కొవ్వత్తుల కోసం డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు.? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించవచ్చు, ప్రభుత్వాన్ని దింపేయాలి. మరిన్ని అందమైన లైట్లు ఉండేలా చూసుకుంటాము’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయోధ్యలో లక్షల సంఖ్యలో దీపాలు వెలిగించడంపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ మాట్లాడుతూ.. ‘‘అఖిలేష్ యాదవ్ దీపావళి సమయంలో క్రిస్మస్ పండగను ప్రశంసిస్తున్నారు. దీపాలు అతడి హృదయాన్ని కాల్చేస్తున్నాయి, అతను వందకోట్ల మంది హిందువులు దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బు వృథా చేయవద్దని, కిస్మస్ నుంచి నేర్చుకోవాలని చెబుతున్నాడు’’ అని విమర్శించారు. అఖిలేష్ హిందువు కన్నా క్రైస్తవుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. భారతీయ సంస్కృతిపై దాడి చేస్తున్నారని అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ