ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు
దిల్లీ: 02,అక్టోబర్ (హి.స.) ఒడిశా స్టేట్ ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టయింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్నపత్రాను తీసుకెళ్తున్న ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అ
ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు


దిల్లీ: 02,అక్టోబర్ (హి.స.) ఒడిశా స్టేట్ ఎస్సై ఎగ్జామ్ పేపర్ లీకేజీ గుట్టు రట్టయింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్నపత్రాను తీసుకెళ్తున్న ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకైన పేపర్‌ను విజయనగరంలో తీసుకోవడానికి వెళ్తున్న 114 మంది అభ్యర్థులు, ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు బస్సుల్లో వెళ్తున్నట్లు ఒరిస్సా పోలీసులు సమాచారం అందింది. దీంతో ఎచ్చర్ల వద్ద మూడు బస్సులను తనిఖీ చేసిన శ్రీకాకుళం పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను ఒరిశా పోలీసులకు అప్పగించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షలు డీలింగ్ కుదిరినట్లు సమాచారం. రూ.10 లక్షలు ముందుగానే చెల్లించాలి. ఉద్యోగం పొందిన తర్వాత మిగిలిన రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందం కుదిరింది.

పోలీసుల కథనం ప్రకారం.. బెర్హంపూర్ పోలీసు బృందానికి రహస్య సమాచారం అందింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో మూడు ఎసీ స్లీపర్ బస్సులను అడ్డగించారు. భువనేశ్వర్‌లోని బారాముండా బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ బస్సుల్లో 117 మంది ప్రయాణికులు ఉన్నారు. విచారణలో వారిలో 114 మంది సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్షకు అభ్యర్థులు అని, భారీ నెట్‌వర్క్ కలిగిన ముగ్గురు ఏజెంట్ల సహాయంతో ప్రయాణిస్తున్నారని వెల్లడైంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande