జీ ఎస్ టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు.1000 కోట్లు ఆదా
అమరావతి, 2 అక్టోబర్ (హి.స.) , జీఎ్‌సటీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాణాధార మందులపై పన్ను తగ్గించడంతో ప్రజలు నేరుగా కొనుగోలు చేసే మందులు, సర్జికల్స్‌పైన రూ.716 కోట్లు.. ప్ర
జీ ఎస్ టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు.1000 కోట్లు ఆదా


అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)

, జీఎ్‌సటీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాణాధార మందులపై పన్ను తగ్గించడంతో ప్రజలు నేరుగా కొనుగోలు చేసే మందులు, సర్జికల్స్‌పైన రూ.716 కోట్లు.. ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో రూ.250 కోట్ల వరకూ వ్యయం తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. 2024-25లో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఇకపై సుమారు రూ.1,000 కోట్లు వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మందులపై గత నెల 21వ తేదీ వరకూ 12ు, 5ు చొప్పున జీఎ్‌సటీ ఉండేది 99 శాతం ఔషధాలు 12 శాతం కేటగిరీలోనే ఉండేవి. ఇప్పుడు దీనిని కేంద్రం ఐదు శాతానికి తగ్గించింది. ‘అంటే 7 శాతం వరకూ పన్ను తగ్గింది. క్యాన్సర్‌ సహా అరుదైన కేటగిరీలో ఉన్న 33 రకాల మందులపై 12 శాతం వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించింది’ అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 35 వేల వరకు మందుల దుకాణాలు, 5 వేలు వరకు టోకు వర్తక సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా 2024-25లో రూ.11,250 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్‌ విక్రయాలు జరిగాయి. జనంపై రూ.1,350 కోట్ల వరకు పన్నుల భారం పడినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం తెలిపింది. ఇప్పుడు జీఎ్‌సటీ తగ్గింపుతో రూ.703 కోట్ల వరకు భారం తగ్గనుంది. ఇవి కాకుండా క్యాన్సర్‌, ఇతర అరుదైన మందుల కొనుగోళ్లు రాష్ట్రంలో రూ.112 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటిపై 12 శాతం పన్ను పూర్తిగా తొలగించినందున సుమారు రూ.13 కోట్ల వరకు బాధితులకు ఉపశమనం లభిస్తుందని అంచనా వేశారు. సదరు సంస్థలు ఖరారు చేసే ఎంఆర్‌పీ ధరల్లోనే జీఎ్‌సటీ ఇమిడి ఉందని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ద్వారా 2024-25లో రూ.4,077 కోట్ల విలువైన ప్రీ-ఆథరైజేషన్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు ఇందులో రూ.2,308.56 కోట్ల వరకూ ఆదా అవుతుందని తెలిపారు. మందులు, సర్జికల్‌ కొనుగోళ్లలో రూ.40 కోట్ల వరకు మిగులుతుందని చెప్పారు. ‘ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా 2024-25లో రూ.679 కోట్లతో మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌, ఇంప్లాంట్స్‌, డయాగ్నస్టిక్‌ కిట్లు, మొదలైన పరికరాలు కొనుగోలు చేశాం. ఇందులో రూ.71 కోట్లు జీఎ్‌సటీ కింద చెల్లించాం. జీఎ్‌సటీ 2.0 కారణంగా ఈ రూ.71 కోట్లలో రూ.40 కోట్లు ఇకపై చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా పరిశీలిస్తే 2.0 సంస్కరణలతో ఏటా సగటున రూ.250 కోట్ల వరకూ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నాం’ అని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande