దిల్లీ: 02,అక్టోబర్ (హి.సదేశంలో తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసు 2027 జూన్ నాటికల్లా అందుబాటులోకి రావచ్చని ‘ఈప్లేన్’ కంపెనీ వ్యవస్థాపకులు, ఐఐటీ మద్రాసు ఏరోనాటికల్ ఇంజినీరింగు విభాగ ఫ్యాకల్టీ సభ్యుడు ప్రొఫెసర్ సత్య చక్రవర్తి చెబుతున్నారు. నగరాల రహదారులు రానురాను రద్దీగా మారుతుండటంతో సమీప గమ్యస్థానాలకు సత్వరం చేరేలా ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ట్యాక్సీలు మార్కెట్లోకి రానున్నాయి. తన విద్యార్థి ప్రంజల్ మెహతాతో కలిసి చక్రవర్తి స్థాపించిన ‘ఈప్లేన్’ కంపెనీ ప్రయాణికుల సౌకర్యార్థం, అత్యవసర వైద్య అవసరాలకు తగ్గట్టుగా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్టులను రూపొందిస్తోంది. ఒక పైలట్, ఇద్దరు ప్రయాణికులు వెళ్లేందుకు అనువుగా వీటి డిజైను సిద్ధం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ