పండగ పూట షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతో తెలుసా?
ముంబై, 2 అక్టోబర్ (హి.స.)దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేటట
Gold


ముంబై, 2 అక్టోబర్ (హి.స.)దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. తాజాగా అక్టోబర్‌ 2న దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారం కొనాలంటే ఏకంగా లక్ష 20 వేల రూపాయల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తులం బంగారం ధర 1లక్ష 19 వేల 250 రూపాయలు ఉంది. అదే వెండి కిలో ధర 1 లక్ష 50 వేల 900 రూపాయల వద్ద ఉండగా, అదే హైదరాబాద్‌, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర 1 లక్ష 60 వేల రూపాయల వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,400 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,09,510 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,09,460 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,09,310 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande