సంఘ్ బలం మాటల్లో కాదు.. చేతలలో ఉంది: ఆర్‌ఎస్‌ఎస్‌కు పవన్ కల్యాణ్ విషెస్..
అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పవన్ కొనియాడారు. క్రమశిక్షణ, సేవ, జ
కల్యాణ్


అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పవన్ కొనియాడారు. క్రమశిక్షణ, సేవ, జాతీయత మొదలైన అంశాలలో అద్భుతమైన నిబద్ధతను చూపిన ఆర్‌ఎస్ఎస్ పవిత్రమైన విజయదశమి రోజున వంద అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు (Pawan Kalyan RSS wishes).

'స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభాలు మొదలైన క్లిష్ట సమయాలలో సహాయం చేసేందుకు ఆర్‌ఎస్ఎస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. సంఘ్ బలం మాటల్లో కాదు, చేతలలో ఉంది. అంకితభావంతో సేవ చేయడంలో ఆర్‌ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సేవను ప్రతిబింబించే లక్షణం ప్రతి స్వయంసేవకుడిలో ఉంది. ఈ చారిత్రాత్మక శతాబ్ది సందర్భంగా ప్రతి స్వయంసేవకుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని పవన్ పేర్కొన్నారు (Pawan Kalyan news).

'ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ నుంచి సంఘ్‌కు 15 సంవత్సరాలకు పైగా నాయకత్వం వహించిన మోహన్ భగవత్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు (RSS greetings). ఆయన ప్రయాణం సనాతన ధర్మానికి సంబంధించిన విలువలపై సమాజాన్ని ఏకం చేయడంలో అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆయన నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ, దేశవ్యాప్తంగా సేవా స్ఫూర్తిని బలోపేతం చేస్తూనే ఉంది' అని పవన్ కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande