దక్షిణ కొరియా,, 2 అక్టోబర్ (హి.స.) రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సాంగ్డో సెంట్రల్ పార్క్‌ను మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు సందర్శించారు. సాంగ్డో స్మార్ట్ సిటీ మధ్యలో 101 ఎకరాల్లో సముద్రపు నీటి పార్కు విస్తరించి ఉంది. దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ సాంగ్డో లో గ్రీన్ స్పేస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్క్‌ను భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్షజాతులతో అద్భుతంగా పార్క్‌ను నిర్మించారు.
సెంట్రల్ పార్క్ నమూనాలను అమరావతి స్మార్ట్ సిటీలో భారీ పార్కుల నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో మంత్రి నారాయణ ఉన్నారు. దక్షిణ కొరియాలోని పార్కులు, రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV