శ్రీనగర్/దిల్లీ: 02,అక్టోబర్ (హి.స.): భారత సరిహద్దుల్లోని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో(POK) పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోయింది. పీఓకేలో అరాచకం సృష్టించింది. పీవోకే ప్రజలు, ఆందోళకారులపై పాక్ సైన్యం(Pakistan Army) విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది గాయపడినట్టు సమాచారం. పాక్ సైన్యం కాల్పులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ