బెంగళూరు/దిల్లీ: 02,అక్టోబర్ (హి.సఎయిర్‌బస్ పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. దేశీయ సాంకేతికతతో పౌర వినియోగానికి... ఎలాంటి వాతావరణంలోనైనా సురక్షితంగా పయనించే హెచ్-125 హెలికాప్టర్ తయారీ గురించి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన ప్రకటన వెలువడింది. ఇందుకోసం టాటా ఎడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్), ఎయిర్‌బస్‌ల మధ్య ఒప్పందం కుదిరినా హెలికాప్టర్ తయారీ కేంద్రం (ఫైనల్ అసెంబ్లీ లైన్-ఎఫ్‌ఏఎల్) ఎక్కడో ప్రకటించలేదు. దీనిపై కొంతకాలం చర్చ కొనసాగింది. చివరకు కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో ఎఫ్‌ఏఎల్ ఏర్పాటు కానున్నట్లు ఎయిర్‌బస్ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే గుజరాత్‌లోని వడోదరలో ఎఫ్‌ఏఎల్‌ను ఎయిర్‌బస్ నెలకొల్పినా అక్కడ యుద్ధ విమానాలు (సీ-295) తయారవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ