దిల్లీ: 02,అక్టోబర్ (హి.సరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర విమర్శలు చేశారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆరెస్సెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసలు కురిపించడాన్ని జైరాం రమేశ్ తప్పుబట్టారు. మోదీ ఇంతలా కొనియాడుతున్న ఆరెస్సెస్ గురించి గతంలో మాజీ ఉప ప్రధాని సర్దార్ పటేల్ (Sardar Patel) ఏమన్నారో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. జులై 18, 1948న డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి సర్దార్ పటేల్ రాసిన లేఖలో ఆరెస్సెస్ (RSS) కార్యకలాపాలు ప్రభుత్వ, రాష్ట్ర ఉనికికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తంచేసినట్లు పేర్కొన్నారు. ఆ సంస్థపై నిషేధం ఉన్నప్పటికీ సంస్థ వర్గాలు నిబంధనలను ధిక్కరిస్తున్నాయని.. దానివల్ల విధ్వంసకర కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయన్నారని తెలిపారు. 1948 డిసెంబర్ 19న జైపుర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో సర్దార్ పటేల్ ఆరెస్సెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ