విజయవాడ, 2 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు (Dussehra celebrations) నేటితో ముగియనున్నాయి.
గత నేల సెప్టెంబర్ 22న ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజు అక్టోబర్ 2 సాయంత్ర వరకు కొనసాగుతున్నాయి.
11 రోజుల్లో 11 రూపాల్లో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. చివరి రోజున.. నేడు దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం 9:45కు దసరా మహా పూర్ణాహుతి కార్యక్రమం కార్యక్రమం ప్రారంభం అయింది.
మరోవైపు విజయదశమి రోజున కృష్ణా నదిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని వరద కారణంగా రద్దు చేశారు. దసరా పండుగ సంద్భంగా దుర్గమ్మ దర్శనం కోసం భక్తుల క్యూలైన్ ఉదయం నుంచి క్రమక్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఘనంగా దసరా పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV