విశాఖపట్నంపై భీకర గాలులు
విశాఖపట్నం 02,అక్టోబర్ (హి.స వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్‌లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్‌లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రో
విశాఖపట్నంపై భీకర గాలులు


విశాఖపట్నం 02,అక్టోబర్ (హి.స వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్‌లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్‌లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది.. ఇక, విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో బెంబేలెత్తుతున్నారు విశాఖ నగరవాసులు..

కాగా, వాయువ్య బంగాళాతంలో తీవ్ర వాయుగుండం… ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ తీరానికి సమీపించే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది.. కళింగపట్నంకు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.. అర్ధరాత్రి గోపాల్‌పూర్ – ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు ఐఎండీ.. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో వీస్తున్నాయి బలమైన ఈదురుగాలులు… సముద్రం అలజడిగా మారింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande