కడప, 2 అక్టోబర్ (హి.స.)కడప ఎమ్మెల్యే మాధవి (MLA Madhavi)పై సోషల్ మీడియా వేదికగా పరువు నష్టం కేసులో కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు, తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే పోస్టులు వెలువడ్డాయని, ఆ పోస్టులు ప్రచారం చేయబడ్డాయని పోలీసులకు తెలిపారు. విచారణలో భాగంగా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తులో ఫేస్‌బుక్ లో ప్రచారంలో ఉన్న పోస్టుల పేజీలను గుర్తించారు. మొత్తం 15 ఫేస్‌బుక్ పేజీలను తొలగించారు. అనంతరం నిందితులను గుర్తించి కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అయితే, తాజాగా ఇదే కేసులో ఆ అభసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేసిన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా (Amjad Basha) పీఏ ఖాజా (Khaja)ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకువచ్చారు. అనంతరం నిందితుడిని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది.. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టమని ఆదేశాలు ఇచ్చింది ఎవరనే అంవాలపై అతడిని ప్రశ్నిస్తున్నారు. అయితే, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం కడప రాజకీయాల్లో కాకరేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV