పండుగ పూట విషాదం.. పద్మ విభూషణ్ చన్నులాల్ మిశ్రా కన్నుమూత
ఢిల్లీ, 2 అక్టోబర్ (హి.స.)విజయ దశమి పర్వదినాన దేశంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయకుడు పద్మ విభూషణ్ గ్రహీత చన్నులాల్ మిశ్రా (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న చన్నులాల్‌ మిశ్రా ఉత్తర ప్రద
పండుగ పూట విషాదం.. పద్మ విభూషణ్ చన్నులాల్ మిశ్రా కన్నుమూత


ఢిల్లీ, 2 అక్టోబర్ (హి.స.)విజయ దశమి పర్వదినాన దేశంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయకుడు పద్మ విభూషణ్ గ్రహీత చన్నులాల్ మిశ్రా (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న చన్నులాల్‌ మిశ్రా ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని తన కుమార్తె ఇంట్లో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే, చన్నులాల్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా వేధిస్తోందని కామెంట్ చేశారు. ఆయన తన జీవితం అంతా భారతీయ కళ, సంస్కృతి సంపన్నత కోసం అంకితమయ్యారని అన్నారు. శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలకు చేరువ చేయడమే కాక, భారతీయ సంప్రదాయాన్ని విశ్వ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టడంలో కూడా విలువైన సహకారం అందించారని గుర్తు చేశారు. నాకు ఎల్లప్పుడూ ఆయన ప్రేమ, ఆశీర్వాదం లభించడం నా అదృష్టమని అన్నారు. 2014లో వారణాసి నుంచి పోటీ చేసేందుకు చన్నులాల్ మిశ్రా తన పేరును ప్రతిపాదించారంటూ ఆయన జ్ఞాపకాలను ప్రధాని ‘X’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

కాగా, 1936 సంవత్సరంలో చన్నులాల్‌ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అపారం అనుభవంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. లెక్క లేనన్ని అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. అయితే, శాస్త్రీయ సంగీత రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు 2010లో పద్మ భూషణ్‌ (Padma Bhushan), 2020లో పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) పురస్కారాలను అందజేసి గౌరవించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande