రెండు డెల్టా విమానాలు ఢీ.. ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన..
న్యూయార్క్‌దిల్లీ: 02,అక్టోబర్ (హి.స.) లా గార్డియా విమానాశ్రయంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. అయితే ఆ సమయంలో రెండు విమానాలూ చాలా నెమ్మదిగా వెళ్తు
రెండు డెల్టా విమానాలు ఢీ.. ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన..


న్యూయార్క్‌దిల్లీ: 02,అక్టోబర్ (హి.స.) లా గార్డియా విమానాశ్రయంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. అయితే ఆ సమయంలో రెండు విమానాలూ చాలా నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఒక విమానం రెక్కకు నష్టం జరిగిందని సమాచారం (Delta plane collision).

ల్యాండింగ్ చేసిన తర్వాత విమానం గేట్ వైపు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో మరో డెల్టా విమానం వెనుకనుంచి ఆ విమానానికి ఢీ కొట్టినట్లు తెలుస్తోంది (New York airport accident). ఈ ప్రమాదం తర్వాత ఒక విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది./

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande