అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) ఎమిరేట్స్ స్కై కార్గో నిర్వహణలో విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్వే దాటి సముద్రంలో దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన హాంగ్కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport)లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో
విమాన ప్రమాదం


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)

ఎమిరేట్స్ స్కై కార్గో నిర్వహణలో

విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్వే దాటి సముద్రంలో దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన హాంగ్కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport)లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది దుర్మరణం చెందగా, విమాన సిబ్బంది నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం ఉదయం 3.50 గంటల సమయంలో చోటుచేసుకుంది. టర్కీకి చెందిన ACT Airlines లీజుపై నిర్వహిస్తున్న Emirates SkyCargo ఫ్లైట్ EK9788 ఇస్తాంబుల్ నుంచి హాంగ్కాంగ్కు చేరుకునే సమయంలో ఉత్తర రన్వేపై ల్యాండ్ అవుతూ అదుపు కోల్పోయింది.

విమానం ముందుగా ఒక ఎయిర్పోర్టు సేవా వాహనాన్ని ఢీకొట్టి, ఆ తరువాత రన్వే అవతల సముద్ర తీరంలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానం లో ఎటువంటి సరుకు (cargo load) లేనట్లు నిర్ధారించారు. సిబ్బందిని సకాలంలో బయటకు తీసిన రక్షక బృందాలు ఇద్దరు ఎయిర్పోర్టు ఉద్యోగుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. హాంగ్కాంగ్ వైమానిక అధికారులు ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. రన్వే పరిస్థితులు, వాతావరణం, పైలట్ ల్యాండింగ్ కోణం వంటి అంశాలను విశ్లేషించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande