రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో .వాయుగుండం
అమరావతి, 20 అక్టోబర్ (హి.స.) రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది మంగళవ
రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో .వాయుగుండం


అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)

రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది మంగళవారం నాటికి అంటే రేపటికి అల్పపీడనంగా బలపడి, ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande