ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ ను తల్లి కుమారుడు అధిరోహించారు
కాచిగూడ, 20 అక్టోబర్ (హి.స.) , ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌క్యాంపును తల్లీకుమారుడు అధిరోహించారు. అందుకు వారికి 8 రోజుల సమయం పట్టింది. ఆదివారం కాచిగూడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే శరణ్య (39), ఏడోతరగతి చదువుతున్న తన కుమారుడు శేయాంశ్‌ (12)తో వివరాలు వ
ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ ను తల్లి కుమారుడు అధిరోహించారు


కాచిగూడ, 20 అక్టోబర్ (హి.స.)

, ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌క్యాంపును తల్లీకుమారుడు అధిరోహించారు. అందుకు వారికి 8 రోజుల సమయం పట్టింది. ఆదివారం కాచిగూడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే శరణ్య (39), ఏడోతరగతి చదువుతున్న తన కుమారుడు శేయాంశ్‌ (12)తో వివరాలు వెల్లడించారు. ఈనెల 3న దిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి నేపాల్‌ కాఠ్‌మాండూకు బయలుదేరారు. ఎమినిది మందితో కూడిన బృందం 5న ఎక్కడం ప్రారంభించి 13న సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande