బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎo
పాట్నా, 21 అక్టోబర్ (హి.స.) బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగర్బంధన్లో
బీహార్ అసెంబ్లీ


పాట్నా, 21 అక్టోబర్ (హి.స.)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగర్బంధన్లో (Mahagathbandhan) సీట్ల పంపకాలపై ఓ స్పష్టత రాలేదు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ (RJD) 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కాంగ్రెస్, ఆర్జేడీ రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

'మహాఘట్బంధన్' కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని జేఎఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande