దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు..
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఇండ్లు, దుకాణ సముదాయాల్లో విశేషంగా లక్ష్మీపూజలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ
దివాళి


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఇండ్లు, దుకాణ సముదాయాల్లో విశేషంగా లక్ష్మీపూజలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా యావత్ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బాణాసంచాల మోతమోగింది. దీపావళి సందర్భంగా గత రెండుమూడు రోజులుగా బాణాసంచా దుకాణాలు కిటకిటలాడాయి. బాణాసంచా ధరలు భారీ ధర పలుకుతున్నా.. పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా పెద్దాచిన్న తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాలుస్తూ దీపావళి వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande