అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)ఢిల్లీ,21,, అక్టోబర్ (హి.స.) ఆపరేషన్ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దీపావళి సందర్భంగా ఆయన లేఖ రాస్తూ.. ఈ ఆపరేషన్‌లో భారత్ తన ధర్మాన్ని నిలబెట్టుకొంటూనే.. ఉగ్రవాదంపై ప్రతీకారం కూడా తీర్చుకొందన్నారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టాలని మనకు బోధిస్తారు, అదే సమయంలో అన్యాయంపై పోరాడే ధైర్యాన్ని కూడా ఇస్తారు. దీనికి సజీవ ఉదాహరణను మనం కొన్ని నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూశాం’’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ