హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)
దీపావళి పురస్కరించుకుని హిందువులకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అసలు పాకిస్థాన్లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ నెటిజన్లు నిలదీశారు. పాకిస్థాన్లో హిందువులు హింసను ఎదుర్కొంటుంటే షెహబాజ్ షరీఫ్ పెట్టిన సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ఇంకొకరు ప్రశ్నించారు. ఇలా రకరకాలుగా పాకిస్థాన్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పండుగ చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని సూచిస్తుందని పేర్కొన్నారు. దీపావళి వెలుగుతో ఇళ్లు, హృదయాలు ప్రకాశింపజేసినట్లుగా ఈ పండుగ చీకటిని పారద్రోలి.. సామరస్యాన్ని పెంపొందిస్తుంది. శాంతి, కరుణ, భాగస్వామ్య శ్రేయస్సు, భవిష్యత్ వైపు మనందరినీ నడిపించాలి. అంటూ రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..