పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దు’
ఢిల్లీ,21,, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్‌ను తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం (అక్టోబర్‌ 21, మంగళవారం) 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 347 పా
Delhi pollution


ఢిల్లీ,21,, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్‌ను తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం (అక్టోబర్‌ 21, మంగళవారం) 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఊపిరి ఆడక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande