పోలీసు వీరులారా.. మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: రాజ్ నాథ్, బండి సంజయ్
ఢిల్లీ, 21 అక్టోబర్ (హి.స.) ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన పోలీస్ అమర వీరుల సేవలను స్మరిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శ్రద్దాంజలి ఘటించారు. ఈ మేరకు బండి సంజయ్ అధికారికంగ
రాజ్ నాథ్, బండి సంజయ్


ఢిల్లీ, 21 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన పోలీస్ అమర వీరుల సేవలను స్మరిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శ్రద్దాంజలి ఘటించారు.

ఈ మేరకు బండి సంజయ్ అధికారికంగా 'X' వేదికగా ప్రకటన విడుదల చేశారు. 'పోలీసు వీరులారా.. మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల, సైనికుల చేతుల్లోనే. బుల్లెట్ ను నమ్ముకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోతారన్నది చరిత్ర చాటిన సత్యం. బ్యాలెట్ ను నమ్ముకున్న వాళ్లను ప్రజాస్వామ్య వాదులంతా స్వాగతించి అక్కున చేర్చుకుంటారన్నది అక్షర సత్యం. బుల్లెట్ ద్వారా సాధించింది. ఏమీ లేదు, ప్రపంచ వ్యాప్తంగా బ్యాలెట్ కు, బుల్లెట్ కు మధ్య ప్రతి ఘటనలో చివరకు గెలిచింది బ్యాలెట్ మాత్రమే. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి బుల్లెట్ ను వ్యతిరేకిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంలో కొనసాగుతున్న మావోయిస్టు నిర్మూలన తుది అంకానికి చేరుకుంది. బుల్లెట్ ను నమ్ముకున్న వాళ్లు పశ్చాత్తాపంతో ఆయుధాలను వదిలి జన జీవన స్రవంతిలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం తథ్యం' అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande