దసరా పండగ పూట. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.) ముదిగుబ్బ: దసరా పండగ పూట శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం దొరగల్లులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో బాలుడు మృతిచెందాడు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజ చేసేందుకు బాలాజీ అనే వ్యక్తి కారు తీసుకొ
దసరా పండగ పూట. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)

ముదిగుబ్బ: దసరా పండగ పూట శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం దొరగల్లులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో బాలుడు మృతిచెందాడు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజ చేసేందుకు బాలాజీ అనే వ్యక్తి కారు తీసుకొచ్చాడు. బ్రైక్‌ బదులు యాక్సలేటర్‌ తొక్కడంతో సమీపంలోని ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. అదే సమయంలో ఇంటిముందు ఆడుకుంటున్న నిఖిల్‌ (5)ను కారు ఢీకొట్టడంతో బాలుడు ఎగిరి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి బాలుడిని తరలించగా.. నిఖిల్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై ముదిగుబ్బ పట్టణ సీఐ శివరాముడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande