ఘోర విషాదం.. దుర్గ మాత విగ్రహంతో పాటు కొట్టుకుపోయిన 9 మంది
ఢిల్లీ, 3 అక్టోబర్ (హి.స.)నవరాత్రుల అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 9 మంది విగ్రహంతో పాటు నదిలో కొట్టుకుపోయారు. ఈ విషాద సంఘటన యూపీలోని ఆగ్రా సమీపంలో
ఘోర విషాదం.. దుర్గ మాత విగ్రహంతో పాటు కొట్టుకుపోయిన 9 మంది


ఢిల్లీ, 3 అక్టోబర్ (హి.స.)నవరాత్రుల అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 9 మంది విగ్రహంతో పాటు నదిలో కొట్టుకుపోయారు. ఈ విషాద సంఘటన యూపీలోని ఆగ్రా సమీపంలో ఉన్న దుంగర్వాల గ్రామంలోని ఉతంగన్ నదిలో లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహం కారణం అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఒకరిని ప్రాణాలతో కాపాడారు. అలాగే మరో ముగ్గురు అప్పటికే ప్రాణాలు కోల్పోగా వారి మృత దేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గల్లంతవ్వగా రెస్క్యూ సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande