అస్సాం, 3 అక్టోబర్ (హి.స.)
అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. జుబీన్ గార్గ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన మృతి కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
జుబీన్ గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అరెస్టు చేశారు. సింగపూర్లో గార్గ్ మరణించిన సమయంలో వీరిద్దరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరూ గార్కు అత్యంత సన్నిహితులు కావడంతో.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు