హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,
సూర్యాపేట మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ నెల 1న రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పార్థీవ దేహాన్ని ఉంచారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాళులు అర్పించారు. అలాగే రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని.. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని గుర్తు చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు