కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి: బండి సంజయ్
తెలంగాణ, కరీంనగర్. 3 అక్టోబర్ (హి.స.) కార్మికుల హక్కుల సాధనలో బీఎమ్మెస్ ముందుండాలని, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం యూనియన్ నాయకులు కృషి చెయ్యాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఇటీవల ఎన్ టి పి సి పర్మనెంట్ ఎంప
బండి సంజయ్


తెలంగాణ, కరీంనగర్. 3 అక్టోబర్ (హి.స.)

కార్మికుల హక్కుల సాధనలో బీఎమ్మెస్ ముందుండాలని, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం యూనియన్ నాయకులు కృషి చెయ్యాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఇటీవల ఎన్ టి పి సి పర్మనెంట్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలలో బిఎంఎస్ గెలుపొందడంతో వారిని సన్మానించి ఆయన మాట్లాడారు.

ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎమ్మెస్ ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీ విజయం కార్మికుల విశ్వాసానికి నిదర్శనం అని అన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం యూనియన్ నాయకులు కృషి చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande