సనాతన ధర్మంపై యువత ఆసక్తి.. కిషన్ రెడ్డి
హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన ''అలయ్ బలయ్'' కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రర మంత్రి మాట్లాడుతూ.. దసరా సందర్భంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమ ప్రాధాన్యతన
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన 'అలయ్ బలయ్' కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రర మంత్రి మాట్లాడుతూ.. దసరా సందర్భంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమ ప్రాధాన్యతను గుర్తుచేశారు. విభేదాలు ఉన్న నాయకులు కూడా ఒకే వేదికపై కలుసుకునే ప్రత్యేక వేదిక ఇదేనని ఆయన పేర్కొన్నారు.

దసరా రోజున మనం ఒకరిని ఒకరు కలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. అదే తరహాలో అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా రాజకీయంగా విభేదించే వ్యక్తులు కూడా ఒకే వేదికపై కలుస్తారు,” అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ ద్వారా అందరినీ కలిపారని ఆయన గుర్తుచేశారు. మునుపు దేవాలయాలకు వృద్ధులు మాత్రమే వెళ్తారని, కానీ ఇప్పుడు పాఠశాల విద్యార్థులు కూడా ఆసక్తిగా దేవాలయాలకు వెళ్ళి చదువుకు బయలుదేరుతున్నారని చెప్పారు. సనాతన ధర్మంపై యువతకు ఆసక్తి పెరగడం సంతోషకరమని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande