హైదరాబాద్కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) దిశ, తెలంగాణ హైదరాబాద్ పర్యటనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా ఆయన శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష
రాజ్ నాథ్ సింగ్


హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)

దిశ,

తెలంగాణ

హైదరాబాద్ పర్యటనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా ఆయన శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్ రాంచందర్ రావు, పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ఈటెల రాజేందర్ నేతలు, అధికారులు ఎయిర్పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు. రాజ్నాథ్ సింగ్ హైటెక్స్లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande