తెలంగాణ, జహీరాబాద్. 3 అక్టోబర్ (హి.స.)
జహీరాబాద్ జిల్లా లోని
తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను(drugs) స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మాడిగి గ్రామ శివారులో అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గోవా నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సులో 46 కిలోల మత్తుపదార్థలు లభ్యం అయ్యాయని పోలీసులు తెలిపారు. అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మత్తు పదార్థాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు