ఫలక్నుమా ఆర్వోబీ ప్రారంభం.. పాతబస్తీ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్లోని పాతబస్తీ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులకు శుక్రవారం పెద్ద ఊరట లభించింది. సికింద్రాబాద్-ఫలక్నుమా బ్రాడ్జ్ లైన్పై జీహెచ్ఎంసీ రూ.52.03 కోట్లతో నిర్మించిన కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ని
ఆర్ఓబి ప్రారంభం


హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్లోని పాతబస్తీ ప్రజలకు

ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులకు శుక్రవారం పెద్ద ఊరట లభించింది. సికింద్రాబాద్-ఫలక్నుమా బ్రాడ్జ్ లైన్పై జీహెచ్ఎంసీ రూ.52.03 కోట్లతో నిర్మించిన కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ని రాష్ట్ర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు.

ఇప్పటికే ఉన్న పాత ఆర్వోబీని పునరుద్ధరించి, దానికి సమాంతరంగా కొత్త వంతెనను నాలుగు వరుసలతో నిర్మించారు. బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వాహనాల రాకపోకలు సులభం కానున్నాయి. గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. సమయం, ఇంధన పొదుపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఇకపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన అవసరం లేదు. ఈ వంతెనతో పాతబస్తీకి కొత్త ఊపిరి వచ్చింది అని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande