బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి అదే రోజు చెక్ క్లియరెన్స్
ముంబై, 3 అక్టోబర్ (హి.స.) బ్యాంకు కస్టమర్లకు ఇది శుభవార్త. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, రేప‌టి (అక్టోబర్ 4) నుంచి ‘అదే రోజు చెక్ క్లియరెన్
బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి అదే రోజు చెక్ క్లియరెన్స్


ముంబై, 3 అక్టోబర్ (హి.స.) బ్యాంకు కస్టమర్లకు ఇది శుభవార్త. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, రేప‌టి (అక్టోబర్ 4) నుంచి ‘అదే రోజు చెక్ క్లియరెన్స్’ విధానం అమల్లోకి రానుంది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా పలు బ్యాంకులు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి.

ఈ నూతన విధానం వల్ల, కస్టమర్లు తమ ఖాతాలో జమ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతాయి. చెల్లింపుల ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ ఈ మార్పులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, చెక్కులు బౌన్స్ కాకుండా ఉండేందుకు ఖాతాదారులు తమ అకౌంట్లలో సరిపడా నగదు నిల్వలు ఉంచుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. అలాగే చెక్కులపై వివరాలను తప్పులు లేకుండా స్పష్టంగా నింపాలని కోరుతున్నాయి.

చెక్కుల భద్రతను పెంచేందుకు ‘పాజిటివ్ పే సిస్టమ్’ను తప్పనిసరిగా ఉపయోగించాలని బ్యాంకులు స్పష్టం చేశాయి. దీని ప్రకారం, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్కులను బ్యాంకులో జమ చేయడానికి కనీసం 24 గంటల ముందు ఖాతాదారులు కొన్ని కీలక వివరాలను బ్యాంకుకు అందించాలి. అకౌంట్ నంబర్, చెక్ నంబర్, తేదీ, చెక్ మొత్తం, లబ్ధిదారుడి పేరు వంటి వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి. ఈ వివరాలను రీజనల్ ఆఫీసులకు కేటాయించిన ఈ-మెయిల్ ఐడీలకు పంపించాల్సి ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande