పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్
న్యూఢిల్లీ, 3 అక్టోబర్ (హి.స.) హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్లో వీడియోలు చేసిన అక్రమ్
యూట్యూబర్


న్యూఢిల్లీ, 3 అక్టోబర్ (హి.స.)

హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్లో వీడియోలు చేసిన అక్రమ్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ గత మూడేండ్ల నుంచి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్రమ్ వాట్సాప్ను పరిశీలించగా, నేరపూరిత సందేశాలను గుర్తించామన్నారు. అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని చెప్పారు. త్వరలోనే అక్రమ్ గూఢచర్యానికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande