హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)
ఇటీవల ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి
తిరిగి పోలీస్ డిపార్ట్మెంటులోకి అడుగు పెట్టి సజ్జనార్.. వచ్చి రాగానే ఆకతాయిలు, రౌడీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఎండీ గా ఉన్నప్పటికీ ఆయన మెరుగైన సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా హైదరాబాద్ కమిషనర్ హోదాలో.. ఆయన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల కు కీలక సూచనలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు తెలివితో ఆలోచించాలని, ఎప్పుడు హాస్యంతో కూడిన వీడియోలను కాకుండా.. శక్తివంతమై కంటెంట్ అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.
అలాగే సోషల్ మీడియాను మహిళల రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్ వంటి భూతల పై అవగాహన కల్పించే విధంగా రీల్స్, పోస్ట్ చేయాలని ఈ సందర్భంగా కంటెంట్ క్రియేటర్లకు సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. కేవలం లైక్స్, షేర్స్ మాత్రమే లక్ష్యంగా కాకుండా కొందరి జీవితాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంచి ఉద్దేశ్యంతో చేసే ఒక్కో వీడియో రేపటి నాడు ఒక జీవితాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..